ప్రజాపాలన అందిస్తుంటే.. విషం చిమ్ముతున్నారు: సీఎం రేవంత్

68చూసినవారు
ప్రజాపాలన అందిస్తుంటే.. విషం చిమ్ముతున్నారు: సీఎం రేవంత్
TG: రాష్ట్రంలో ప్రజాపాలన అందిస్తుంటే తమపై విషం చిమ్ముతున్నారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోవాలని ఒక కుటుంబం మొత్తం దాడికి దిగుతోందన్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి సభలో ఆయన మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాని మోదీ సహా దేశవ్యాప్తంగా ఉన్న నేతలను ప్రచారానికి తీసుకొచ్చినా.. భాజపా ఒక్క మున్సిపాలిటీ అయినా గెలుస్తుందా? అని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్, భాజపా మధ్య ఉన్నది ఫెవికాల్ బంధం కాదా అని ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్