అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ UK పర్యటన సందర్భంగా, న్యూయార్క్ మీదుగా వెళుతున్న ఎయిర్ ఫోర్స్ వన్ విమానానికి స్పిరిట్ ఎయిర్‌లైన్స్ ప్యాసింజర్ విమానం చాలా దగ్గరగా వెళ్ళింది. సెప్టెంబర్ 17న జరిగిన ఈ ఘటనలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు స్పిరిట్ ఎయిర్‌లైన్స్ పైలట్‌లను వెంటనే దిశను మార్చుకోవాలని ఆదేశించడంతో పెను ప్రమాదం తప్పింది. స్పిరిట్ ఫ్లైట్ 1300 ఫోర్ట్ లాడర్‌డేల్ నుండి బోస్టన్‌కు వెళుతుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది.