
చంద్రయాన్ మిషన్: ఇస్రోకు నాసా ఆహ్వానం
భారత్, అమెరికా అంతరిక్ష సహకారం మరింత బలపడనుంది. చంద్రుడిపై మానవులను పంపే ప్రతిష్టాత్మక ఆర్టిమెస్ మిషన్లో భాగస్వామి కావాలని ఇస్రోను నాసా ఆహ్వానించింది. చంద్రునిపై శాశ్వత నివాసం ఏర్పాటు చేయడం, శాస్త్రీయ పరిశోధనలు, కొత్త టెక్నాలజీల అభివృద్ధి, అంగారక గ్రహ యాత్రలకు ఈ మిషన్ కీలకం. ఆగస్టు 5, 6 తేదీల్లో బెంగళూరులో జరిగిన భారత్-అమెరికా సివిల్ స్పేస్ జాయింట్ వర్కింగ్ గ్రూప్ 9వ సమావేశంలో ఈ అంశాలపై చర్చలు జరిగాయి. 2023 జూన్ 21న భారత్ ఆర్టెమిస్ ఒప్పందంలో చేరింది.




