ప్రతిరోజూ బంగారం ధరలను నిర్ణయించేది ఎవరు?

43చూసినవారు
ప్రతిరోజూ బంగారం ధరలను నిర్ణయించేది ఎవరు?
దేశంలో బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతుండగా, రోజువారీ రేట్లు ఎలా నిర్ణయిస్తారు అన్న దానిపై ఆసక్తి ఉంటుంది. గ్లోబల్‌గా బంగారం ధరలను లండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్ (LBMA) ఉదయం 10:30, మధ్యాహ్నం 3:00 గంటలకు ప్రకటిస్తుంది. భారత్‌లో అదే రేట్లను ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) రూపాయిల్లో విడుదల చేస్తుంది. డాలర్-రూపాయి మారకం విలువ, డిమాండ్-సప్లై, ఇంపోర్ట్ ఛార్జీలు వంటివి ధరలపై ప్రభావం చూపుతాయి.

సంబంధిత పోస్ట్