
ఐఎఫ్‌ఎఫ్‌ఎం 2026.. ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకున్న రిషబ్ శెట్టి
కాంతార హీరో రిషబ్ శెట్టి ప్రతిష్టాత్మక ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్‌లో ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకున్నారు. 'కాంతార ఏ లెజెండ్ చాప్టర్-1' మూవీకి గానూ ఆయన ఈ పురస్కారం పొందారు. అంతేకాకుండా, ఆయన లీడర్‌షిప్ ఇన్ సినిమా అవార్డును కూడా సొంతం చేసుకున్నారు. ఈ అవార్డుల వేడుక ఆస్ట్రేలియాలో జరిగింది. ఈ వేడుకలో ప్రముఖ నటి రేఖ ఎక్స్‌లెన్స్ ఇన్ సినిమా పురస్కారానికి ఎంపికయ్యారు. బాలీవుడ్ నటి రాణీ ముఖర్జీకి 30 ఏళ్ల సినీ ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక గుర్తింపునిచ్చి సన్మానించారు. దుల్కర్ సల్మాన్, కీర్తి కుల్హరి, విజయ్ వర్మ, రసికా దుగల్ ఉత్తమ నటీనటులుగా అవార్డులు గెలుచుకున్నారు. 'కొత్త లోకా చాప్టర్-1' ఉత్తమ చిత్రంగా నిలిచింది.




