TG: టన్నుకు రూ.3,800 లభించే సింగరేణి బొగ్గును వద్దని, విదేశాల నుండి టన్నుకు రూ.9,000 పెట్టి బొగ్గును దిగుమతి చేసుకోవాలనే
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని
కేటీఆర్ తీవ్రంగా తప్పుబట్టారు. '
కాంగ్రెస్ ప్రభుత్వం మరో తుగ్లక్ నిర్ణయం తీసుకుంది. టన్ను రూ.3,800కు ఇచ్చే సింగరేణి బొగ్గు జెన్కోకు వద్దంట. విదేశాల నుంచి టన్ను రూ.9 వేలకు దిగుమతి చేసుకుంటారట' అని వ్యాఖ్యానించారు. ఎవరికి లబ్ధి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని, ప్రజలు ఈ భారం ఎందుకు మోయాలని కేటీఆర్ ప్రశ్నించారు.