భారత్‌లో 30% మహిళలు జీవితంలో ఒక్కసారి అయినా భర్తల వేధింపులకు గురవుతున్నారని WHO తాజా నివేదిక వెల్లడించింది. 2023లో 15–49 ఏళ్ల మహిళల్లో కనీసం సగం మంది పురుషుల హింసను ఎదుర్కొంటున్నారని చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా ముగ్గురిలో ఒకరు, అంటే దాదాపు 84 కోట్ల మహిళలు దాంపత్య హింస, లైంగిక హింసకు లోనవుతున్నారని అంచనా. 2000–2023 మధ్య జరిగిన 23 ఏళ్ల అధ్యయనంపై ఆధారమైన ఈ నివేదిక, 2030 నాటికి మహిళలపై హింస నిర్మూలన లక్ష్యంలో పురోగతి కనిపించడం లేదని పేర్కొంది.