ఖైరతాబాద్ కాంగ్రెస్ టికెట్ ఎవరికి?

10437చూసినవారు
ఖైరతాబాద్ కాంగ్రెస్ టికెట్ ఎవరికి?
TG: ఖైరతాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్‌ నుంచి దానం నాగేందర్‌కు మళ్లీ టికెట్ ఇస్తారా లేదా అనేది సస్పెన్స్‌గా మారింది. మరోవైపు టికెట్ తమకే వస్తుందని విజయారెడ్డి, రోహిన్ రెడ్డి ఆశలు పెట్టుకున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా తనకే టికెట్ వస్తుందని దానం తన అనుచరులతో చెప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే సుప్రీంకోర్టులో విచారణ సమయంలో తాను బీఆర్ఎస్‌ పార్టీలోనే ఉన్నానని దానం చెప్పినట్లు సమాచారం. అలాంటప్పుడు దానంకు మళ్లీ టికెట్ ఇస్తే పార్టీ ప్రతిష్ట దెబ్బ తింటుందని రోహిన్ రెడ్డి, విజయారెడ్డి వర్గీయుల అభ్యంతరాలు తెలిపినట్లు టాక్. ఈ నేపథ్యంలోనే సీటు ఎవరికి ఇవ్వాలన్న అంశంపై కాంగ్రెస్ అగ్రనేతలతో సీఎం రేవంత్ రెడ్డి చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్