
మెడికల్ కాలేజీలపై జగన్ రాజకీయాలు చేస్తున్నారు: మంత్రి కొల్లు రవీంద్ర
మెడికల్ కాలేజీలపై మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ రాజకీయాలు చేస్తున్నారని ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు.. రాష్ట్ర ప్రభుత్వమే మెడికల్ కాలేజీలు నిర్మించాలంటే రూ. 7 వేల కోట్లు ఖర్చు అవుతుందని ఆయన అన్నారు. పీపీపీ విధానంలో వేగంగా నిర్మించవచ్చని, పేద విద్యార్థులకు 1,750 ఉచిత సీట్లు లభిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని నాశనం చేయాలని జగన్ యత్నిస్తున్నారని ఆరోపించారు. కోటి సంతకాల సేకరణ వైసీపీ చేస్తున్న డ్రామా అని ఎద్దేవా చేశారు.




