రైల్వే సీట్లు బ్లూ కలర్‌లోనే ఎందుకు ఉంటాయి?

0చూసినవారు
రైల్వే సీట్లు బ్లూ కలర్‌లోనే ఎందుకు ఉంటాయి?
భారతీయ రైళ్లలో సీట్లు, బెర్త్‌లు నీలం రంగులో ఉండటానికి కారణం కలర్ సైకాలజీ. నీలం రంగు ప్రశాంతత, స్థిరత్వానికి ప్రతీక. ఆకాశం, సముద్రం వంటి ప్రకృతి దృశ్యాలతో ముడిపడి ఉన్న ఈ రంగు కంటికి సౌకర్యంగా ఉంటుంది. సుదూర ప్రయాణాల్లో ప్రశాంత వాతావరణాన్ని అందిస్తుంది. అంతేకాకుండా, ముదురు నీలం రంగుపై దుమ్ము, మరకలు అంతగా కనిపించవు. ఇది సీట్లు తరచుగా మురికిగా కనిపించకుండా సహాయపడుతుంది. నీలం రంగు మెదడులో ప్రశాంతతను ఇచ్చే రసాయనాలను విడుదల చేసి, మానసిక ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది. గుండె వేగాన్ని నియంత్రిస్తుంది.

సంబంధిత పోస్ట్