విమానం కాక్‌పిట్‌లో ఎప్పుడూ ఇద్దరు పైలట్లు ఎందుకుండాలి?

4చూసినవారు
విమానం కాక్‌పిట్‌లో ఎప్పుడూ ఇద్దరు పైలట్లు ఎందుకుండాలి?
విమానంలో ప్రయాణికుల భద్రతకు కాక్‌పిట్‌లోని పైలట్లదే బాధ్యత. అయితే, కాక్‌పిట్‌లో పైలట్ ఒంటరిగా ఉంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. 1999లో ఈజిప్ట్‌ఎయిర్‌ 990, 2015లో జర్మన్‌వింగ్స్‌ 9525 ప్రమాదాల్లో ఒక పైలట్‌ కాక్‌పిట్‌ నుంచి బయటకు వెళ్లిన సమయంలోనే విమానాలు ప్రమాదానికి గురయ్యాయి. జర్మన్‌వింగ్స్‌ ఘటన తర్వాత కాక్‌పిట్‌లో కనీసం ఇద్దరు సిబ్బంది ఉండేలా మార్గదర్శకాలు వచ్చాయి. అనంతరం రిస్క్‌ ఆధారిత విధానాలు అమల్లోకి వచ్చినా.. 2026లో యూరోపియన్‌ ఏవియేషన్‌ సేఫ్టీ ఏజెన్సీ (EASA) మళ్లీ పెద్ద వాణిజ్య విమానాల్లో ఇద్దరు అనుమతిపొందిన వ్యక్తులు కాక్‌పిట్‌లో ఉండటానికి ప్రాధాన్యం ఇచ్చింది.

సంబంధిత పోస్ట్