
దుండగుల కాల్పుల్లో కాంగ్రెస్ నాయకుడు మృతి
కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో శుక్రవారం స్థానిక కాంగ్రెస్ నేత, కాంట్రాక్టర్, మాజీ పంచాయతీ అధ్యక్షుడు డేవిడ్ డీసౌజా దుండగుల కాల్పుల్లో మరణించారు. ఇద్దరు వ్యక్తులు కారులో వచ్చి ఆయనపై కాల్పులు జరిపి పరారయ్యారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ఆయన మరణించారు. హత్యకు కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.




