గాంధీజీకి నోబెల్ శాంతి బహుమతి ఎందుకు రాలేదు?

0చూసినవారు
గాంధీజీకి నోబెల్ శాంతి బహుమతి ఎందుకు రాలేదు?
గాంధీజీ అహింసా సిద్ధాంతాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్నప్పటికీ.. ఆయనకు నోబెల్‌ శాంతి బహుమతి దక్కలేదు. 1937, 1938, 1939, 1947, 1948 సంవత్సరాల్లో ఆయన పేరు నామినేట్‌ అయింది. అయితే కమిటీ సందేహాలు, దేశ విభజన సమయంలో హింస, 1948లో ఆయన మరణం వంటి కారణాలతో అవార్డు ఇవ్వలేదు. ఆ ఏడాది అర్హులైన సజీవ అభ్యర్థి ఎవరూ లేరంటూ బహుమతిని ఎవరికీ ప్రకటించలేదు. తర్వాతి కాలంలో నోబెల్ కమిటీ సభ్యులు ఈ చారిత్రక తప్పిదాన్ని అంగీకరిస్తూ, 1989లో దలైలామాకు పురస్కారం ప్రకటించినప్పుడు, అది గాంధీ స్మృతికి నివాళి అని వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్