దోమలు కొందరినే ఎందుకు కుడతాయి?

8166చూసినవారు
దోమలు కొందరినే ఎందుకు కుడతాయి?
వర్షాకాలంలో దోమల బెడద పెరుగుతుంది. డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల భయంతో జాగ్రత్తలు తీసుకున్నా, కొందరినే దోమలు ఎక్కువగా కుట్టడానికి శాస్త్రీయ కారణాలున్నాయని వైద్య అధ్యయనాలు చెబుతున్నాయి. శరీరంలోని లాక్టిక్ ఆమ్లం, అమ్మోనియా వంటి సమ్మేళనాలు, చర్మ బ్యాక్టీరియా వల్ల వెలువడే వాసనలు, 'O' గ్రూప్ రక్తం, ఎక్కువ కార్బన్ డయాక్సైడ్ విడుదల, ముదురు రంగు దుస్తులు, అధిక శరీర ఉష్ణోగ్రత, మద్యం సేవించడం వంటివి దోమలను ఆకర్షిస్తాయి. నిపుణుల సూచనల ప్రకారం, ముదురు రంగు దుస్తులు తగ్గించి, శరీరాన్ని శుభ్రంగా, పొడిగా ఉంచుకోవడం ద్వారా దోమల బారి నుంచి తప్పించుకోవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్