తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బీఆర్‌ఎస్‌పై, కవిత కొత్త పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. "కొత్త పార్టీ గురించి మనకు ఎందుకు?. ఉన్న పార్టీ ఉంటుందా..? ఉండదో చూడండి. కేసీఆర్ పార్టీ పర్పస్ సాల్వ్ అయ్యింది. బీఆర్‌ఎస్ పార్టీకి గతం ఉంది. భవిష్యత్ లేదు. చనిపోయిన శవానికి ఎంత అలంకరణ చేసినా లేచి రాదు. బీఆర్‌ఎస్ పార్టీ కూడా చచ్చిపోయిన శవంతో సమానం" అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.