ప్రభుత్వ పథకాల పేర్లు మార్చడం ఖర్చుతో కూడుకున్నదని, అయినా కేంద్రం మారుస్తూనే ఉందని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ అన్నారు. లోక్‌సభలో మాట్లాడుతూ, ఎంజీ నరేగా చట్టం పేదలకు 100 రోజుల ఉపాధి హామీ కల్పిస్తోందని, కొత్త బిల్లుతో ప్రస్తుత చట్టాన్ని బలహీనపరిచే ప్రయత్నం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. పని దినాలను పెంచినప్పటికీ, వేతనాన్ని పెంచారా అని ప్రియాంక ప్రశ్నించారు.