E20 పెట్రోల్ ధర ఎందుకు తగ్గట్లేదు? కేంద్రం క్లారిటీ

12192చూసినవారు
E20 పెట్రోల్ ధర ఎందుకు తగ్గట్లేదు? కేంద్రం క్లారిటీ
లీటరుకు 20% ఇథనాల్ కలిపినా పెట్రోల్ ధర ఎందుకు తగ్గడం లేదనే వాహనదారుల సందేహాలకు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ స్పష్టత ఇచ్చింది. E20 పెట్రోల్ ఉద్దేశం ధర తగ్గించడం కాదని, విదేశీ ముడి చమురుపై ఆధారపడటాన్ని తగ్గించి దేశ ఇంధన భద్రతను బలోపేతం చేయడమే ప్రధాన లక్ష్యమని తెలిపింది. నిర్వహణ ఖర్చుల వల్ల E20 పెట్రోల్ తయారీ వ్యయం సాధారణ పెట్రోల్ కంటే ఎక్కువగా ఉంటోందని వివరించింది. భవిష్యత్తులో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితే E20 పెట్రోల్ చౌకగా మారే అవకాశం ఉందని పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్