దసరా రోజు ఆయుధ పూజ ఎందుకు చేస్తారు?

75చూసినవారు
దసరా రోజు ఆయుధ పూజ ఎందుకు చేస్తారు?
విజయదశమి రోజు చెడుపై మంచి సాధించిన విజయాన్ని గుర్తు చేసుకుంటూ అమ్మవారికి పూజలు చేస్తారు. అమ్మవారికి విజయాన్ని తెచ్చిపెట్టిన ఆయుధాలను, మనిషి జీవన పోరాటంలో తన వృత్తికి ఉపయోగపడే ఆయుధాలన్నింటినీ దైవంగా భావించేటువంటి పర్వం విజయదశమి. అందుకే ఆ రోజున ఆయుధాలకు పూజ చేస్తారు. ఇక్కడ కేవలం మనకు ఉపయోగపడే వస్తువుల పట్ల మనకున్న గౌరవం, కృతజ్ఞతను దీంట్లో ఆవిష్కరించడమే కాకుండా, సర్వత్రా ఉన్న భగవత్‌ తత్వాన్ని గ్రహించాలనే గొప్ప సందేశం కూడా ఇమిడి ఉంది.