ఈ మట్టిలో ఉన్న ప్రతి అణువులో పరబ్రహ్మ కొలువై ఉంటాడు. పవిత్రమైన గణపతి మట్టి విగ్రహాన్ని పూజించిన తర్వాత నిమజ్జనం చేయకుండా వదిలేయడం దోషమని పురాణాలు చెబుతున్నాయి. నిమజ్జనం అంటే కేవలంలో నీటిలో ముంచడం కాదు. ఆత్మను విశ్వాత్మతో ఐక్యం చేయడం. ఈ విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేసినప్పుడు అది తిరిగి మట్టిలో కలిసిపోయి పరబ్రహ్మ స్వరూపమైన భూమితో ఐక్యమవుతుంది. ఇది మనం వచ్చిన చోటికే తిరిగి చేరుకోవడాన్ని సూచిస్తుంది.