వినాయక నిమజ్జనం వెనుక ప్రత్యేక ఆధ్యాత్మిక కారణాలున్నాయి. మట్టి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేసి పూజించిన తర్వాత, దానిని నీటిలో నిమజ్జనం చేయడం వల్ల అది కరిగి మట్టిలో కలిసి పరబ్రహ్మతో ఐక్యమవుతుందని భక్తుల విశ్వాసం. ఇది సృష్టి, స్థితి, లయం అనే జగత్ చక్రాన్ని సూచిస్తుంది. ఈ ప్రక్రియ ద్వారా విగ్రహం తిరిగి ప్రకృతిలో లీనమవుతుంది. అంతేకాక, పూజలో ఉపయోగించిన ఔషధ గుణాలున్న పత్రి, పూజా సామగ్రిని కూడా ఈశ్వరార్పణంగా నీటిలో సమర్పిస్తారు.