క్రిప్టోకరెన్సీల విషయంలో భారత్ ఇప్పటికీ జాగ్రత్తగా వ్యవహరిస్తోందని ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. క్రిప్టో వెనుక ఉన్న డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీ (DLT), టోకనైజేషన్ వంటి సాంకేతికతల్లో మాత్రం ఆవిష్కరణలను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ప్రైవేట్ క్రిప్టో ఆస్తుల విస్తృత వినియోగం ద్రవ్య సార్వభౌమాధికారం, ద్రవ్య విధానం, మూలధన ప్రవాహాలు, ఆర్థిక స్థిరత్వంపై ప్రభావం చూపే అవకాశం ఉందని వివరించారు. దేశీయ చెల్లింపులకు భారత్‌లో ఇప్పటికే వేగవంతమైన డిజిటల్ వ్యవస్థ ఉందని, సరిహద్దు చెల్లింపుల కోసం CBDC వంటి ప్రత్యామ్నాయాలను పరిశీలించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.