125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి ఎందుకు తాళం వేశారు?: KTR

1561చూసినవారు
125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి ఎందుకు తాళం వేశారు?: KTR
HYDలోని 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి ఎందుకు తాళం వేశారని అసెంబ్లీలో KTR ప్రశ్నించారు. 'సాంస్కృతిక సారధి కింద గత కేసీఆర్ ప్రభుత్వం 550 మందికి ఉద్యోగాలు ఇచ్చింది. రామప్ప దేవాలయానికి యునెస్కో వారసత్వ గుర్తింపు తీసుకొచ్చాం. యాదాద్రిని అద్భుతంగా నిర్మించాం. రంగనాయక సాగర్, కొండ పోచమ్మ సాగర్ లను నిర్మించి పర్యాటకం కోసం డబ్బులు కేటాయించాం. HYDలోని అమరవీరుల స్మారకాన్ని ప్రజలకు ఎందుకు అందుబాటులోకి తీసుకురావడం లేదు' అని విమర్శించారు.

సంబంధిత పోస్ట్