TG: మాజీ సీఎం
కేసీఆర్ కుటుంబ ఆస్తులు నిజాం ఆస్తుల కంటే ఎక్కువని
కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్‌లోని అజీజ్‌నగర్‌లో మూడోరోజు భూముల పరిశీలనలో భాగంగా ఆదివారం ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో
కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు పర్యటించారు. ఈ సందర్భంగా చామల కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. కేటీఆర్‌కు 2009లో లేని ఆస్తులు ఇప్పుడు ఎలా వచ్చాయని, హరీశ్‌రావుకు ఉద్యమ సమయంలో లేని ఫామ్‌హౌస్ ఇప్పుడు ఎలా వచ్చిందని ప్రశ్నించారు.
కేసీఆర్ ఫామ్‌హౌస్ పక్కన ఉన్న 300 ఎకరాల అసైన్డ్ భూములను దళితులకు ఎందుకు పంచలేదని ప్రశ్నించారు.