వరంగల్ జిల్లా చెన్నారావుపేటకు చెందిన స్రవంతి, ఆమె పిల్లలు హైదరాబాద్‌లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. బుధవారం వారి అంత్యక్రియల కోసం బోడ మాణిక్యం తండాకు మృతదేహాలను తీసుకురావడంతో ఉద్రిక్తత నెలకొంది. ఆగ్రహించిన బంధువులు, భర్త ప్రవీణ్‌పై నిరసన వ్యక్తం చేస్తూ, పిల్లల మృతదేహాలను అతని ఇంటి ఆవరణలోనే ఖననం చేశారు. ఈ ఘటనతో గ్రామస్థులు, కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు.