భర్తను హత్య చేసిన భార్య అరెస్ట్

6432చూసినవారు
భర్తను హత్య చేసిన భార్య అరెస్ట్
TG: ఆదిలాబాద్ రూరల్ మండలం లోహార గ్రామంలో భర్తను హత్య చేసిన భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఉట్నూర్‌కు చెందిన సోలంకి గణపతి(54), భార్య మధురాబాయి(52)తో కలిసి లోహార గ్రామంలో డేరా వేసుకుని నివాసం ఉంటున్నారు. మద్యానికి బానిసైన గణపతి తరచూ వేధించడంతో.. తట్టుకోలేక మధురాబాయి ఈ నెల 28న ఇనుప రాడ్‌తో తలపై కొట్టి అతడిని హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితురాలిని అరెస్ట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్