TG: యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భర్తను ఓ మహిళ సుత్తితో కొట్టి చంపింది. పోలీసుల వివరాల ప్రకారం.. గుండాల గ్రామానికి చెందిన మాదరబోయిన బిక్షం(64), ఉప్పలమ్మ(57) దంపతులు. వారిద్దరూ తరచూ గొడవలు పడేవారని, ఆదివారం తెల్లవారుజామున కూడా గొడవ పడ్డారని తెలిపారు. ఆవేశానికి లోనైన భార్య సుత్తితో భర్త తలపై కొట్టడంతో అతను అపస్మారక స్థితిలో జారుకుని కింద పడి చనిపోయాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనాస్థలానికి వచ్చి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.