పెళ్లికి ముందు మరో వ్యక్తిని ప్రేమించిన భార్య.. ఉరేసుకుని భర్త ఆత్మహత్య

0చూసినవారు
పెళ్లికి ముందు మరో వ్యక్తిని ప్రేమించిన భార్య.. ఉరేసుకుని భర్త ఆత్మహత్య
TG: సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ పీఎస్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. పెళ్లికి ముందు భార్య వేరే వ్యక్తిని ప్రేమించిందని మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం.. నారాయణపేట జిల్లాకు చెందిన రాములు (23)కు వికారాబాద్ కు చెందిన ఓ యువతితో నెల కిందట వివాహం జరిగింది. ఇటీవల రాములు తన భార్యను ఎవరినైనా ప్రేమించావా అని అడగడంతో ఆమె తాను ఓ వ్యక్తిని ప్రేమించానని చెప్పింది. దీంతో మనస్తాపానికి గురైన రాములు శనివారం చెట్టుకు ఉరి వేసుకొని మృతి చెందాడు.
Job Suitcase

Jobs near you