AP: భార్య మృతి చెందిన 25 రోజుల వ్యవధిలో ప్రమాదవశాత్తూ కరెంట్ షాక్తో భర్త మృతి చెందాడు. ఈ విషాద ఘటన నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలంలో చోటుచేసుకుంది. ఇసుకపల్లె గ్రామానికి చెందిన బొబ్బూరి గోపాల్, శ్రీలత దంపతులు. వీరికి ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. శ్రీలత (60) సెప్టెంబర్ 6న అనారోగ్యంతో మృతి చెందింది. శుక్రవారం ఆమె భర్త గోపాల్ (65) ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి మృతి చెందాడు.