బెడ్‌రూమ్‌లో భార్య.. బాత్‌రూమ్‌లో భర్త ఆత్మహత్య

62చూసినవారు
బెడ్‌రూమ్‌లో భార్య.. బాత్‌రూమ్‌లో భర్త ఆత్మహత్య
AP: బాపట్ల జిల్లా వేటపాలెం మండలంలో కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. రావురిపేట గ్రామానికి చెందిన మాజేటి ప్రభాకర్, పార్వతి దంపతులకు ఐదు సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి 14 నెలల పాప ఉంది. మధ్యాహ్నం భార్య పార్వతి తన పాపను పక్కింటి వారికిచ్చి ఇంటికి వెళ్లింది. చాలా సేపటి వరకు తిరిగి రాకపోవడంతో, ప్రభాకర్ సోదరుడు ఇంటికి వచ్చి తలుపులు బద్దలు కొట్టి చూడగా, భార్య బెడ్ రూంలో, భర్త బాత్ రూంలో ఉరివేసుకుని కనిపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్