వివాహేతర బంధానికి అడ్డొస్తున్నాడని.. భర్తను గుడికి తీసుకెళ్లి చంపిన భార్య

35చూసినవారు
వివాహేతర బంధానికి అడ్డొస్తున్నాడని.. భర్తను గుడికి తీసుకెళ్లి చంపిన భార్య
AP: వివాహేతర బంధానికి అడ్డొస్తున్నాడని భర్తను హత్య చేసిన ఘటన చిత్తూరు జిల్లాలో కలకలం రేపింది. తమిళనాడుకు చెందిన రమేష్‌, కుప్పంకి చెందిన హాసిని పెళ్లి చేసుకున్నాడు. వీరు ఏడాది వయసున్న కుమార్తెతో కలిసి మంగళవారం మల్లప్పకొండ మల్లేశ్వరస్వామి ఆలయానికి బైక్‌పై వెళ్లారు. అయితే రాత్రి అయినా తిరిగి ఇంటికి రాకపోవడంతో హాసిని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ దృశ్యాల్లో హాసిని తిరుగు ప్రయాణంలో మరో ఇద్దరు యువకులతో భర్త బైక్‌పైనే వెళ్తున్నట్లు గుర్తించారు. అనంతరం ఘాట్‌రోడ్డు సమీప అటవీ ప్రాంతంలో రమేష్‌ మృతదేహం లభించింది. హాసినితో పాటు మరో ఇద్దరు కలిసి హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించగా, అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్