తాగి వేధిస్తున్నాడని భర్తను చంపేసిన భార్య (వీడియో)

0చూసినవారు
TG: మద్యం సేవించి వేధిస్తున్నాడని క్షణికావేశానికి గురైన భార్య భర్తపై దాడి చేసింది. మేడ్చల్ పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ పట్టణంలోని రామలింగేశ్వర స్వామి ఆలయం దగ్గర నివాసం ఉంటున్న నరసింహ (45) తరచూ మద్యం సేవించి వేధిస్తున్నాడని భార్య దాడి చేసిందని తెలిపారు. ప్రాణాంతక గాయాలు అవ్వడంతో నరసింహ మృతి చెందాడు. మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్