ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య

32చూసినవారు
ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య
TG: నాగర్‌కర్నూల్‌లో ఓ హోటల్ నిర్వాహకుడు కరీం హత్య కేసును పోలీసులు ఛేదించారు. స్థానిక రామ్ నగర్ కాలనీలోని తన ఇంట్లో కరీం ఈ నెల 10న అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కరీంను ప్రియుడితో కలిసి భార్య సలీమా హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. కరీం హోటల్లో పని చేస్తున్న గౌస్ పాషాతో సలీమా ఎఫైర్ పెట్టుకుంది. భర్తను అడ్డుతొలగించుకోవాలని ప్లాన్ వేసి.. తాను ఇంట్లో లేనప్పుడు అతడిని చంపాలని గౌస్ పాషాకు చెప్పింది. హత్య కుట్రలో భాగంగా సలీమా.. ఈ నెల 9న నెల్లూరు దర్గాకు వెళ్లింది. ఈ మేరకు ఇంట్లో ఒంటరిగా ఉన్న కరీంను కత్తితో పొడిచి గౌస్ హత్య చేశాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్