ఢిల్లీలోని జహంగీర్‌పురి PS పరిధిలో దారుణం చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం గురించి నిలదీశాడని భర్తను భార్య, ఆమె తల్లి కలిసి సజీవదహనం చేశారు. రాత్రి సమయంలో మంటల్లో కాలిపోతూ యువకుడు ఇంటి మెట్లపై నుండి కిందకు పడిపోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. చనిపోయే ముందు ఆ యువకుడి స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశారు. అందులో తన భార్యకు వివాహేతర సంబంధం ఉందని, ఆమెతో పాటు అత్త మరికొంతమంది తనపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారని బాధితుడు ఆరోపించాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.