పాలకోవాలో విషం పెట్టి భార్య హత్య

15చూసినవారు
పాలకోవాలో విషం పెట్టి భార్య హత్య
AP: భార్య లావుగా మారడంతో పాటు తనను అనుమానిస్తోందని భర్త కక్ష పెంచుకున్నాడు. పాలకోవాలో విషం కలిపి ఆమెకు తినిపించి హత్య చేశాడు. గత నెల వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల దర్యాప్తుతో వెలుగులోకి వచ్చింది. ప్రొద్దుటూరుకు చెందిన కిరణ్‌కుమార్, పద్మజ (31) దంపతులు. కిరణ్‌కుమార్ ఇల్లరికం అల్లుడిగా వెళ్లాడు. ఇటీవల భార్య లావుగా మారిందని, తనను అనుమానిస్తోందని అతను పద్మజపై కక్ష పెంచుకున్నాడు. తన తల్లిదండ్రులను చూసొద్దామని భార్యను ప్రొద్దుటూరుకు తీసుకెళ్లి హత్య చేశాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్