హర్యానాలోని ఫరీదాబాద్‌లో కుటుంబ కలహాల నేపథ్యంలో యోగేశ్ కుమార్ అనే వ్యక్తి 15వ ఫ్లోర్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. యోగేశ్, నేహా దంపతులు 9 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. ఇద్దరూ ఉద్యోగులు కావడంతో కూతురి (6) సంరక్షణ కోసం యోగేశ్ తల్లిని తమతో ఉండమని పిలిపించాడు. అయితే దీనిపై భార్య నేహాకు, ఆమె కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు చోటుచేసుకున్నాయి. అత్త ఇంట్లో ఉండటానికి వీళ్లేదని భార్య గొడవపడడంతో యోగేశ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు నేహా సహా ఐదుగురిపై కేసు నమోదు చేశారు.