భర్తపై యాసిడ్ పోసిన భార్య (VIDEO)

26చూసినవారు
AP: అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం ఠాణేలంకలో శనివారం దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో పులపకూరి అర్జున్ కుమార్‌పై అతని భార్య దుర్గా భవాని బాత్రూమ్ యాసిడ్ పోసినట్లు సమాచారం. తీవ్ర గాయాలపాలైన అర్జున్‌ను వెంటనే అమలాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దుర్గా భవాని అదే ఆసుపత్రిలో కాంట్రాక్ట్ నర్సుగా పనిచేస్తోంది. తన ఉద్యోగాన్ని పర్మినెంట్ చేస్తామని భర్త బంధువులు డబ్బులు తీసుకుని మోసం చేశారని, అదే వివాదం ఈ దాడికి కారణమైనట్లు తెలుస్తోంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్