భర్తను చంపి పాతిపెట్టిన భార్య.. ఘటనా స్థలంలోనే పంచనామా

62చూసినవారు
భర్తను చంపి పాతిపెట్టిన భార్య.. ఘటనా స్థలంలోనే పంచనామా
AP: అనంతపురం జిల్లా పాతచెరువు గ్రామంలో నాలుగు నెలల క్రితం జరిగిన భర్త హనుమంతు హత్య కేసు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భార్య సుకన్య, మద్యానికి బానిసైన భర్తతో గొడవపడి రోకలిబండతో తలపై కొట్టి హత్య చేసినట్లు సమాచారం. ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని ఇంటి ముందే పాతిపెట్టి, భర్త కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. పోలీసులు, రెవెన్యూ అధికారుల సమక్షంలో తవ్వకాలు జరిపి హనుమంతు మృతదేహాన్ని బయటకు తీశారు. ఘటనా స్థలంలో పంచనామా నిర్వహించి, అవశేషాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్