మహారాష్ట్రలో ఓ యువతి తన వరుడి సిబిల్ స్కోర్‌ను చెక్ చేసి, అతను ఆర్థికంగా స్థిరంగా ఉన్నాడని నిర్ధారించుకున్న తర్వాతే పెళ్లికి అంగీకరించింది. వరుడి స్కోర్ 750 పైగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సంఘటన తాజాగా సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. కొందరు ఆర్థిక స్థిరత్వం వివాహానికి అవసరమని సమర్థిస్తుండగా, మరికొందరు ప్రేమ, విశ్వాసం కంటే సిబిల్ స్కోర్ ఎక్కువా? అని ప్రశ్నిస్తున్నారు.