కేరళలో జరిగిన ఒక సంఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియో వైరల్ అవుతోంది. ఒక అడవి దున్న ఒక బైక్ షోరూమ్ గాజు తలుపును పగలగొట్టి లోపలికి ప్రవేశించింది. అది ప్రమాదవశాత్తు షోరూమ్‌లోకి ప్రవేశించిందా లేక ఉద్దేశపూర్వకంగా వచ్చిందా అనేది తెలియరాలేదు. ఆ అడవి దున్న లోపలికి ప్రవేశించడంతో షోరూమ్ గాజు పగిలిపోయింది. ఈ దిగ్భ్రాంతికరమైన సంఘటన కేరళలోని కన్నూర్ జిల్లాలో జరిగింది.