తెలుగు చిత్ర పరిశ్రమలో
ఎన్టీఆర్, కె. రాఘవేంద్రరావుల హిట్ కాంబినేషన్‌లో వచ్చిన 'అడవి రాముడు' సినిమా విడుదలై ఏప్రిల్ 28 నాటికి 49 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఆయన సోషల్ మీడియాలో మాట్లాడుతూ, 'అడవి రాముడు' సినిమా తనకు సక్సెస్ కన్నా ఎక్కువ ఇచ్చిందని, జ్ఞాపకాలు, బంధాలు, ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని ఇచ్చిందని తెలిపారు.