తెలంగాణలో త్వరలో 5వేల పోలీస్ ఉద్యోగాల భర్తీ?

11చూసినవారు
తెలంగాణలో త్వరలో 5వేల పోలీస్ ఉద్యోగాల భర్తీ?
తెలంగాణ పోలీసుశాఖలో 19 వేలకు పైగా పోలీసు పోస్టులు ఖాళీగా ఉన్న నేపథ్యంలో దశల వారీగా రిక్రూట్‌మెంట్‌ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా తొలుత 5 వేల కానిస్టేబుల్‌, SI పోస్టులను భర్తీ చేసే ఆలోచనలో ఉందని సమాచారం. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు పోలీసుశాఖ నుంచి ఆర్ధికశాఖకు చేరినట్లు తెలుస్తోంది. అక్కడి నుంచి క్లియరెన్స్ రాగానే నోటిఫికేషన్ రిలీజయ్యే అవకాశం ఉంది. సైబర్ సెక్యూరిటీ బ్యూరో, ఈగల్ ఫోర్స్ బలోపేతమే లక్ష్యంగా ఈ రిక్రూట్‌మెంట్ చేపడుతున్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్