ప్రభుత్వం, చిత్ర పరిశ్రమ మధ్య వారధిగా పనిచేస్తా: TFDC ఛైర్మన్ దిల్‌ రాజు

19825చూసినవారు
తెలంగాణ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌(టీఎఫ్‌డీసీ) ఛైర్మన్‌గా టాలీవుడ్‌ నిర్మాత దిల్‌ రాజు ఇవాళ బాధ్యతలు చేపట్టారు. ఆయన మాట్లాడుతూ ‘‘టీఎఫ్‌డీసీకి పూర్వవైభవం తీసుకురావాలి. అందుకు అందరి సహకారం అవసరం ఉంది. తెలంగాణ సంస్కృతిని ఆధారంగా చేసుకొని సినిమాలు వచ్చేలా చూడాలి. ప్రభుత్వానికి, చిత్ర పరిశ్రమకు మధ్య వారధిగా పనిచేస్తా. పరిశ్రమలోని అన్ని విభాగాల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తా’’ అని దిల్‌రాజు చెప్పారు.

ట్యాగ్స్ :