బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగే అవకాశం ఉందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆందోళన వ్యక్తం చేశారు. తన నియోజకవర్గం భవానీపూర్‌లో తాను స్వయంగా కాపలా కాస్తానని, మిగిలిన తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షించాలని ఆమె దిశానిర్దేశం చేశారు.