ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మాపై కేసులు పెడతారా: మాధవరం కృష్ణారావు

0చూసినవారు
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మాపై కేసులు పెడతారా: మాధవరం కృష్ణారావు
TG: అసెంబ్లీ నుంచి సస్పెన్షన్‌పై కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్పందించారు. అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు మైక్‌లు ఇవ్వడం లేదని తెలిపారు. కాంగ్రెస్‌ స్కామ్‌ల గురించి మాట్లాడితే సీబీఐ అంటున్నారని, అబద్ధపు హామీలిచ్చిన రేవంత్ రెడ్డిపై కేసులు పెట్టాలని అన్నారు. పేద ప్రజలకు రూ.4వేల పింఛన్, డబుల్‌ బెడ్రూం ఇళ్లు, కల్యాణలక్ష్మీ అడిగామని తెలిపారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మాపై కేసులు పెడతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీలు అమలు చేయనుందుకు వారిపైనే సీబీసీఐడీ కేసులు పెట్టాలని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్