ఉత్తరప్రదేశ్ మహోబా జిల్లాలో బీజేపీ పార్టీలో సంచలన ఘటన చోటుచేసుకుంది. పార్టీలో పదవి కావాలంటే శృంగారంలో పాల్గొనాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కోరాడని ఓ మహిళా నేత ఆరోపించారు. అతడి చెప్పినట్లు చేయాలని పార్టీ నేతల ద్వారా ఒత్తిడి చేస్తున్నారని ఆమె ఫేస్‌బుక్ లైవ్ ద్వారా వెల్లడించారు. ఈ ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.