TG: బీసీ సమస్యలపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ భవన్‌లో మాట్లాడిన ఆయన.. 'బీసీ హక్కుల కోసం ప్రాణం పోయినా సరే పోరాడుతా' అని వీహెచ్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఈ నెల 9వ తేదీన ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని ప్రకటించారు. బీసీ సమస్యలపై బీజేపీ బీసీ ఎంపీలు ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. తాజాగా జరుగుతున్న జనగణనలో బీసీల ప్రస్తావనే లేకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.