TG:
కవిత పార్టీ తెలంగాణ రక్షణసేన (TRS) పేరుపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ పార్టీపై కేంద్ర ఎన్నికల సంఘానికి దాదాపు 600 నుంచి 700 వరకు అభ్యంతరాలు అందినట్లు సమాచారం. అభ్యంతరాల గడువు ముగిసి ఇప
్పటికే నెల రోజులైంది. కొన్నింటికి ఇప్పటికే టీఆర్ఎస్ ప్రతినిధులు వివరణ ఇచ్చారు. అయితే ప్రధానంగా బీఆర్ఎస్ పార్
టీ ఈ పేరుపై అభ్యంతరం వ్యక్తం చేసింది. గ
తంలో తమ పార్టీ టీఆర్ఎస్‌గా కొనసాగిందని, అదే పేరును కవిత కొనసాగిస్తే తమకు నష్టం జరిగే అవకాశం ఉందని పేర్కొన్నట్లు సమామచారం. కాగా అభ్యంతరాలు, సమాధానాలను పరిశీలించి ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.