తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి విజయ్ పార్టీకి ఎమ్మెల్యేల సంఖ్యాబలం తక్కువగా ఉందని, ఈ నేపథ్యంలో టీవీకే (Vijay's party)కు తమ పార్టీ మద్దతు ఇస్తుందని వస్తున్న వార్తలను అన్నా డీఎంకే ముఖ్య నేత కేపీ మునుస్వామి ఖండించారు. మద్దతుపై వస్తున్న వార్తలు అవాస్తవమని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో ఈ పరిణామం ఆసక్తికరంగా మారింది.