విద్యార్థులు 57% మంది ప్రతివారం ఏఐ టూల్స్ వాడుతున్నారు. ఇది చదువును సులభతరం చేసినా, విమర్శనాత్మక ఆలోచనా శక్తి తగ్గిపోతుందని గ్యాలప్, కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ అధ్యయనం వెల్లడించింది. 'కాగ్నిటివ్ ఆఫ్ లోడింగ్' వల్ల లోతైన ఆలోచన తగ్గే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏఐ ఇచ్చే సమాచారాన్ని పరిశీలించకుండా నమ్మితే తప్పులు జరిగే అవకాశం ఉంది.
విద్యార్థులు ఏఐని ఒక సాధనంగా వాడాలి కానీ పూర్తిగా ఆధారపడకూడదని నిపుణులు అంటున్నారు.