Top 10 viral news 🔥

షాకింగ్: తులం బంగారం రూ.3 లక్షలు!
ఈ ఏడాది బంగారం ధరలు ఎన్నడూ లేనంత రికార్డు స్థాయిలో పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర $4,000 మార్కు దాటగా, ఈ ఏడాదిలోనే 50% పైగా పెరిగింది. త్వరలో బంగారం ధరలు తగ్గుతాయని పెట్టుబడిదారులు ఊహిస్తున్నారు. అయితే, నిపుణులు మాత్రం కొత్త అంచనాలు వెల్లడించారు. ద్రవ్యోల్బణం, గ్లోబల్ అనిశ్చితి కారణంగా బంగారం మరింత పెరుగుతుందని, 2028 చివరి నాటికి లేదా 2029 ప్రారంభంలో ఔన్సు ధర $10,000 చేరవచ్చని చెప్తున్నారు. అంటే భారత కరెన్సీలో తులం ధర రూ.3 లక్షలకు చేరవచ్చు.




